ఎల్లమ్మ.. జానపదుల ఇష్టదేవత
పరశురాముని తల్లిగా, శాక్షేయంలో పరాశక్తి సమరూపమైన భిన్నమస్తగా, శైవంలో పార్వతీస్వరూపంగా ఆమె ఎల్లరకూ అమ్మ, అందుకే జానపదులు ఎల్లమ్మ అని భజిస్తారు. జమదగ్ని పత్ని రేణుక జానపదుల కులదేవత.
Sirli Yellamma Talli
అమ్మలగన్న యమ్మ, ఆమేనే ముగురమ్మల మూలపుటమ్మ పోతన వంటి భక్త కవులు ఛందస్సులో తల్లి సుతులు రాస్తే, జానపదులు అమ్మ అన్న చిన్నపదంతో పరాశక్తిని స్వంతం చేసుకున్నారు. అమ్మ అన్న ఈ చిన్న పదంలోనే భక్తునికి, భగవతికి మధ్య ఉన్న దూరం సమసిపోతోంది